marriage: గాళ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన క్రికెట్ స్టార్

ABN , First Publish Date - 2022-07-25T16:51:54+05:30 IST

ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్(Australian cricket star), స్పిన్నర్ నాథన్ లియోన్ ఎమ్మా తన చిరకాల గాళ్‌ఫ్రెండ్ మెక్‌కార్తీని వివాహం చేసుకున్నాడు....

marriage: గాళ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన క్రికెట్ స్టార్

సిడ్నీ(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్(Australian cricket star), స్పిన్నర్ నాథన్ లియోన్ ఎమ్మా తన చిరకాల గాళ్‌ఫ్రెండ్ మెక్‌కార్తీని వివాహం చేసుకున్నాడు. తన చిరకాల స్నేహితురాలు మెక్‌కార్తీని నాథన్ లియోన్ ఆదివారం వివాహం చేసుకున్న తర్వాత(Gets Married) తన భార్యతో కలిసి దిగిన ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో (Instagram)పంచుకున్నాడు.లియోన్, మెక్ కార్తీ దంపతులకు పలువురు అభినందన సందేశాలు పంపించారు. శ్రీలంక క్రికెట్ జట్టుతో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో లియాన్ చివరిసారిగా కనిపించాడు.స్పిన్నర్ నాథన్ లియోన్ తన ఇన్‌స్టాగ్రాం పోస్టుకి ‘‘మిస్టర్ అండ్ మిసెస్’’ అని క్యాప్షన్ ఇచ్చారు.పెళ్లి అనంతరం మెక్‌కార్తీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తన పేరును ఎమ్మా లియోన్‌గా మార్చుకున్నారు.నూతన వధువు మెక్‌కార్తీ పూసలతో కూడిన తెల్లటి గౌనును, వరుడు లియోన్ నల్లటి టక్సేడో ధరించారు.


ఐదేళ్లుగా డేటింగ్ 

తన మొదటి వివాహం విచ్ఛిన్నమైన తర్వాత లియోన్ మెక్ కార్తీ ప్రేమలో మునిగాడు. లియోన్, మెక్‌కార్తీలు 2017లో డేటింగ్ ప్రారంభించారు. పెర్త్‌లో వీరిద్దరూ ముద్దు పెట్టుకున్నప్పుడు వారి మధ్య సంబంధం బహిరంగమైంది. 2020లో వారు సిడ్నీలోని టెన్నిసన్ పాయింట్‌లో3.8 మిలియన్ డాలర్లతో తమ మొదటి ఇంటిని కొనుగోలు చేశారు.గత ఏడాది ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి.భారత్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో మెక్‌కార్తీ తన వేలిపై రింగ్‌తో కనిపించిన తర్వాత ఎంగేజ్‌మెంట్ రింగ్‌ పెట్టుకున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.శ్రీలంకతో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో లియాన్ 11 వికెట్లు తీశారు.ఇతను మొదటి టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టాడు.తొలి టెస్టులో మొత్తం తొమ్మిది వికెట్లతో వెనుదిరిగాడు.మొత్తం మీద స్పిన్నర్ లియోన్ 110 మ్యాచ్‌లలో 438 వికెట్లు పడగొట్టాడు.లియాన్ ఆస్ట్రేలియా తరపున 29 ఓడీఐలు ఆడి, 29 వికెట్లు పడగొట్టాడు. లియోన్ చివరిసారిగా 2018 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో టీ20 మ్యాచ్ ఆడాడు.


Updated Date - 2022-07-25T16:51:54+05:30 IST