కాన్బెర్రా: ఆస్ట్రేలియాకు వచ్చే విద్యార్థులు, వర్కింగ్ హాలిడే వీసా కార్డుదారులకు ఆ దేశ ప్రధాని వీసా ఫీజులో రిబేటు ప్రకటించారు. విద్యార్థులకు 8 వారాలు, వర్కింగ్ హాలిడే వీసా కార్డుదారులకు 12 వారాలు రిబేటు కల్పిస్తామన్నారు. తాజా ప్రకటనతో 1,75,000 మంది ఆస్ట్రేలియాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒమైక్రాన్ నేపథ్యంలో దేశంలో తలె త్తిన ఉద్యోగులు, కార్మికుల తీవ్ర కొరత నుంచి గట్టేకేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ ఇటీవల తీవ్ర ఒత్తిడికి గురైంది. ఒమైక్రాన్ బాధిత కార్మికులు ఐసొలేషన్లోకి వెళ్లడంతో దేశవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థ స్తంభించింది. ఆహార, రవాణారంగ సంస్థల్లో రోజూ 10-50శాతం ఉద్యోగులు విధులకు రావడం లేదు.
ఇవి కూడా చదవండి