సెమీస్‌కు ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2020-03-03T07:31:32+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా.. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ్‌సకు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఎలో చావోరేవో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగులతో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో కివీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆసీస్‌ మొత్తం 6 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంతో నాకౌట్‌

సెమీస్‌కు ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా.. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ్‌సకు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఎలో చావోరేవో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగులతో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో కివీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆసీస్‌ మొత్తం 6 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంతో నాకౌట్‌ చేరింది. సోమవారం జరిగిన ఈ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 155/5 స్కోరు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (60) అర్ధ శతకం సాధించింది. ఛేదనలో న్యూజిలాండ్‌ ఓవర్లన్నీ ఆడి 151/7తో పరాజయం పాలైంది. స్పిన్నర్‌ జార్జియా వేర్‌హార్‌ (3/17) కివీస్‌ టాపార్డర్‌ను దెబ్బతీసింది. ఇక, టోర్నీని శ్రీలంక గెలుపుతో ముగించింది. టోర్నీ నుంచి ఈపాటికే అవుటైన లంక.. ఆఖరి లీగ్‌మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్లతో చిత్తు చేసింది. తొలుత బంగ్లా 20 ఓవర్లలో 91/8 స్కోరు చేసింది. కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన శశికళ సిరివర్దనె (4/16) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఛేదనలో లంక 15.3 ఓవర్లలో 92/1 స్కోరు చేసి గెలిచింది. 

Updated Date - 2020-03-03T07:31:32+05:30 IST