Abn logo
Sep 18 2020 @ 15:26PM

యూఏఈ చేరుకున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు

Kaakateeya

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభోత్సవానికి ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. తమ ఆటగాళ్లు వచ్చేసినట్టు పేర్కొంటూ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలు పీపీఈ కిట్లు ధరించి ఉన్న తమ ఆటగాళ్ల ఫొటోలను షేర్ చేశాయి. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోలు యూఏఈ చేరుకున్నట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేర్కొనగా, కమిన్స్, మోర్గాన్, బాంటన్‌లు దుబాయ్ చేరుకున్నట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ పేర్కొంది.


ఈ నెల 16న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ముగిసిన వెంటనే ఇరు జట్లలోని ఐపీఎల్ ఆటగాళ్లు యూఏఈ పయనమయ్యారు. మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో చేజిక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపు (శనివారం) ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. 


Advertisement
Advertisement
Advertisement