ఆసీస్‌ మహిళలదే తొలి టీ20

ABN , First Publish Date - 2020-09-27T09:38:14+05:30 IST

న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీ్‌సలో ఆతిథ్య ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ ...

ఆసీస్‌ మహిళలదే తొలి టీ20

బ్రిస్బేన్‌: న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీ్‌సలో ఆతిథ్య ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 17 పరుగులతో గెలిచింది. తొలుత ఆష్లీ గార్డ్‌నర్‌ (61) రాణించడంతో కంగారూలు 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 రన్స్‌ చేశారు. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 24, రేచల్‌ 23 రన్స్‌ సాధించారు. ఛేదనలో కివీస్‌ ఓవర్లన్నీ ఆడి 121/7 స్కోరుకే పరిమితమైంది. సుజీ బేట్స్‌ (33), కెప్టెన్‌ సోఫీ డేవిన్‌ (29), కేట్‌ మార్టిన్‌ (21) పోరాడినా ఫలితం లేకపోయింది. మెగాన్‌ 4 వికెట్లు తీసింది. 

Updated Date - 2020-09-27T09:38:14+05:30 IST