కమిన్స్‌కు ఆసీస్‌ టెస్ట్‌ పగ్గాలు

ABN , First Publish Date - 2021-11-27T08:50:38+05:30 IST

స్ట్రేలియా టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌ నియమితుడయ్యాడు. అతడి డిప్యూటీగా స్టీవ్‌ స్మిత్‌ ఎంపికయ్యాడు. ఆసీస్‌ జట్టుకు పూర్తిస్థాయి

కమిన్స్‌కు ఆసీస్‌ టెస్ట్‌ పగ్గాలు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌ నియమితుడయ్యాడు. అతడి డిప్యూటీగా స్టీవ్‌ స్మిత్‌ ఎంపికయ్యాడు. ఆసీస్‌ జట్టుకు పూర్తిస్థాయి సారథిగా నియమితుడైన తొలి పేసర్‌ కమిన్స్‌ కావడం విశేషం. గత సారథి పెయిన్‌ రాజీనామా చేయడంతో ప్యాట్‌కు పదోన్నతి లభించింది. వచ్చేనెల 8 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే యాషెస్‌ తొలి టెస్ట్‌తో కమిన్స్‌ నాయకత్వ బాధ్యతలు చేపడతాడు. కాగా..మాజీ కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌నుంచి నిరవధిక సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Updated Date - 2021-11-27T08:50:38+05:30 IST