అరబిందో, శాండోజ్‌ డీల్‌ రద్దు

ABN , First Publish Date - 2020-04-03T06:09:11+05:30 IST

అమెరికాలో శాండోజ్‌ ఇంక్‌కు చెందిన జెనరిక్‌ ఓరల్‌ సాలిడ్స్‌, డెర్మటాలజీ వ్యాపారాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదిత డీల్‌ను రద్దు చేసుకున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఆరబిందో ఫార్మా...

అరబిందో, శాండోజ్‌ డీల్‌ రద్దు

న్యూఢిల్లీ: అమెరికాలో శాండోజ్‌ ఇంక్‌కు చెందిన జెనరిక్‌ ఓరల్‌ సాలిడ్స్‌, డెర్మటాలజీ వ్యాపారాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదిత డీల్‌ను రద్దు చేసుకున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఆరబిందో ఫార్మా తెలిపింది. ఈ డీల్‌ విలువ 90 కోట్ల డాలర్లు. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందానికి యూఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ నుంచి ఆశించిన సమయంలో ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో ఒప్పందం రద్దు నిర్ణయం తీసుకున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. శాండోజ్‌.. జెనరిక్‌ ఫార్మాసూటికల్స్‌, బయోసిమిలర్స్‌లో ప్రముఖ కంపెనీగా ఉంది. ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్‌ అనుబంధ కంపె నీ.


అమెరికాలో శాండోజ్‌ ఇంక్‌కు చెందిన వాణిజ్యపరమైన కార్యకలాపాలు, మూ డు మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను కొనుగోలు చేసేందుకు 2018 సెప్టెంబరులో అరబిందో ఫార్మా అమెరికా అనుబంధ సంస్థ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ ఇంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ డీల్‌ 2019లోనే ముగియాల్సి ఉంది. అయితే యూఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ నుంచి అనుమతులు రావడంలో జా ప్యం జరగడం వల్ల డీల్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఈ డీల్‌ పూర్తయి ఉంటే డెర్మటాలజీ రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా అరబిందో ఫార్మా మారేది. అంతేకాకుండా ప్రిస్ర్కిప్షన్స్‌ పరంగా అమెరికాలో రెండో అతిపెద్ద జెనరిక్స్‌ కంపెనీగా అవతరించేది. అంతేకాకుండా ఈ డీల్‌తో 300 ఉత్పత్తులు అరబిందో చేతికి వచ్చేవి. 

Updated Date - 2020-04-03T06:09:11+05:30 IST