మే నాటికి టీకాల ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-11-30T07:01:03+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా వివిధ రకాల టీకా(వ్యాక్సిన్‌)ల ఉత్పత్తికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే కల్లా ఈ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ అనలిస్టుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు...

మే నాటికి టీకాల ఉత్పత్తి

  • అరబిందో ఫార్మా


న్యూఢిల్లీ : హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా వివిధ రకాల టీకా(వ్యాక్సిన్‌)ల ఉత్పత్తికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే కల్లా ఈ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ అనలిస్టుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కంపెనీ రూ.275 కోట్ల అంచనాతో 45 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్ధ్యంతో హైదరాబాద్‌లో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. తమ కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసే వ్యాక్సిన్లు, సీఎ్‌సఆర్‌ ల్యాబ్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు లేదా ఇతర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తామని ఎండీ చెప్పారు. అరబిందో ఫార్మా ఇప్పటికే సార్స్‌, కోవిడ్‌-19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమై ఉంది. ‘మా వ్యాక్సిన్‌ అభివృద్ది కొద్దిగా ఆలస్యం కావచ్చు. అయితే సీఎ్‌సఐఆర్‌ ల్యాబ్‌ వ్యాక్సిన్‌ పురోభివృద్ధిలో ఉంది. మా వ్యాక్సిన్‌ ప్లాంట్‌ను వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి చేసి ఏప్రిల్‌ లేదా మే నుంచి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని అనుకుంటున్నాం’ అని గోవిందరాజన్‌ చెప్పారు. 

Updated Date - 2020-11-30T07:01:03+05:30 IST