వచ్చే ఏడాదిలో అరబిందో ఫార్మా

ABN , First Publish Date - 2021-06-13T08:28:11+05:30 IST

తొలి బయోసిమిలర్‌ ఔషధాన్ని అరబిందో ఫార్మా వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల చేయనుంది. రెండు బయోసిమిలర్ల అనుమతి కోసం ఈ ఏడాదిలో, మరో రెండింటి అనుమతుల

వచ్చే ఏడాదిలో అరబిందో  ఫార్మా

తొలి బయోసిమిలర్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తొలి బయోసిమిలర్‌ ఔషధాన్ని అరబిందో ఫార్మా వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల చేయనుంది. రెండు బయోసిమిలర్ల అనుమతి కోసం ఈ ఏడాదిలో, మరో రెండింటి అనుమతుల కోసం వచ్చే ఏడాదిలో దరఖాస్తు చేయనున్నట్లు  అరబిందో ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ గోవింద రాజన్‌ తెలిపారు. రెండు బయోసిమిలర్లకు ముందగా యూర్‌పలో ఆ తర్వాత అమెరికాలో దరఖాస్తు చేస్తామని చెప్పారు. మిగిలిన రెండు బయోసిమిలర్లను అమెరికా, యూర్‌పతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. కేన్సర్‌, ఇమ్యునాలజీ, ఆప్తమాలజీ, రెస్పిరేటరీ విభాగాల్లో మొత్తం 13 బయోసిమిలర్లను అరబిందో ఫార్మా రెండు దశల్లో అభివృద్ధి చేస్తోంది.  

Updated Date - 2021-06-13T08:28:11+05:30 IST