అరబిందో లాభం రూ.850 కోట్లు

ABN , First Publish Date - 2020-06-04T05:54:10+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి అరబిందో ఫార్మా రూ.849.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితంతో పోలిస్తే లాభం 45.2 శాతంపెరిగింది...

అరబిందో లాభం రూ.850 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి అరబిందో ఫార్మా రూ.849.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితంతో పోలిస్తే లాభం 45.2 శాతంపెరిగింది. ఆదాయం 16.4 శాతం వృద్ధితో రూ.6,158 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికాలో ఫార్ములేషన్ల అమ్మకాలు 20.5 శాతం పెరిగి రూ.2,990 కోట్లకు చేరాయి. ఏడాది నికర లాభం 19.7 శాతం పెరిగి రూ.2,831 కోట్లకు చేరింది. వార్షికాదాయం కూడా 18.1 శాతం వృద్ధితో రూ.23,098 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ పని తీరు బాగా ఉందని అరబిందో ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ గోవింద రాజన్‌ తెలిపారు. 


Updated Date - 2020-06-04T05:54:10+05:30 IST