కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి అరబిందో, సీఎ్‌సఐఆర్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-09-16T06:28:13+05:30 IST

కొవిడ్‌- 19 వ్యాక్సిన్‌ అభివృద్ధికి అరబిందో ఫార్మా, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) చేతులు కలిపాయి.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి అరబిందో, సీఎ్‌సఐఆర్‌ ఒప్పందం

క్లినిక్‌ పరీక్షలు, వాణిజ్య ఉత్పత్తికి అరబిందో సహకారం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌- 19 వ్యాక్సిన్‌ అభివృద్ధికి అరబిందో ఫార్మా, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) చేతులు కలిపాయి. ఈ మేరకు సీఎ్‌సఐఆర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ), అరబిందో ఫార్మా ఒప్పందం కుదుర్చుకున్నాయి.


ఒప్పందానికి అనుగుణంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అరబిందో ఫార్మా, సీఎ్‌సఐఆర్‌ కలిసి పనిచేస్తాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీ, చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ టెక్నాలజీ (ఐఎంటెక్‌), కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీ).. వివిధ రకాల టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లపై కొవిడ్‌ వ్యాక్సిన్స్‌ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్స్‌కు సంబంధించిన క్లినికల్‌ పరీక్షలు, వాణిజ్యపరమైన ఉత్పత్తిని అరబిందో చేపడుతుంది.


కొవిడ్‌-19ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ల అభివృద్ధిలో సీఎ్‌సఐఆర్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉందని అరబిందో ఫార్మా మేనేజింగ్‌  డైరెక్టర్‌ ఎన్‌ గోవిందరాజన్‌ తెలిపారు. దేశీయంగా వ్యాక్సిన్ల అభివృద్ధి, భవిష్యత్తు ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని సీఎ్‌సఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సీ మాండే తెలిపారు. తమ ల్యాబ్స్‌లో కొత్త వ్యాక్సి న్‌ అభివృద్ధి ప్రక్రియ జరుగుతోందని, వాణిజ్యపరమైన ఉత్ప త్తి అరబిందో ముందుకు రావడం సంతోషకరమైన విషయమని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

 ఈ ఒప్పందంతో సంబంధం లేకుండా ఇప్పటికే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అరబిందో ఫార్మా అమెరికా అనుబంధ సంస్థ అరో వ్యాక్సిన్స్‌ అభివృద్ధి చేస్తోంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌, ఇతర వ్యాక్సిన్ల తయారీ కోసం హైదరాబాద్‌లో అరబిందో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 


బీఐఆర్‌ఏసీ సహకారం:

నేషనల్‌ బయోఫార్మా మిషన్‌ కింద బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) కొవిడ్‌- 19 వ్యాక్సిన్‌ తయారీకి అరబిందో ఫార్మాకు సహకరించనుంది. ఆర్‌-వీఎ్‌సవీ వ్యాక్సిన్‌ తయారీ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుకు మద్దతి వ్వనుంది. కొవిడ్‌-19తో పాటు వైరల్‌ వ్యాక్సిన్ల తయారీ అరబిందో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 


Updated Date - 2020-09-16T06:28:13+05:30 IST