కోడలే.. కొడుకై!

ABN , First Publish Date - 2022-07-02T05:07:37+05:30 IST

భర్త ఇల్లు విడిచి పోయాడు. పదేళ్లుగా రాలేదు. నిరుపేద కుటుంబం. కాయకష్టం చేస్తేనే పూట గడుస్తుంది. అయినా అత్తను అమ్మలా ఆదరించింది. కొడుకులా బాగోగులు చూసుకుంది. చనిపోతే తానే అంత్యక్రియలు నిర్వహించింది. సోంపేట మండలం మామిడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కోడలే.. కొడుకై!
కోమలమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న పద్మ

- అత్త అంత్యక్రియలు నిర్వహించిన కోడలు
(సోంపేట రూరల్‌)

భర్త ఇల్లు విడిచి పోయాడు. పదేళ్లుగా రాలేదు. నిరుపేద కుటుంబం. కాయకష్టం చేస్తేనే పూట గడుస్తుంది. అయినా అత్తను అమ్మలా ఆదరించింది. కొడుకులా బాగోగులు చూసుకుంది. చనిపోతే తానే అంత్యక్రియలు నిర్వహించింది. సోంపేట మండలం మామిడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ స్థుల వివరాల మేరకు.. మామిడిపల్లిలో గుడియా కోమలమ్మ(81) భర్త 50 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లి పోయాడు. పదేళ్ల క్రితం కొడుకు రామారావు కూడా తన ఇద్దరు చెల్లెళ్లను, భార్య పద్మ, పిల్లలను విడిచిపెట్లి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పద్మ కాయకష్టం చేసి అత్త, కుమారుడిని పోషిస్తోంది. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. కోమలమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. కొరివి పెట్టాల్సిన కొడుకు లేడు. దీంతో పద్మ ఆ బాధ్యత తానే తీసుకుంది. అత్త చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేసిం ది. నిరుపేద కుటుంబం కావడంతో కోమలమ్మ అంత్య క్రియలకు స్థానిక యువకులు ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు.       

 
 

Updated Date - 2022-07-02T05:07:37+05:30 IST