కాశీబుగ్గ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆడిట్‌

ABN , First Publish Date - 2021-09-18T04:49:07+05:30 IST

కాశీబుగ్గ గాంధీనగర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శుక్రవారం ఆడిట్‌ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్‌ నాగలింగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు. గత రెండేళ్లలో జరిగిన భూముల క్రయవిక్రయాలు, చలానా వివరాలపై ఆరాతీశారు. రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన చలానా కుంభకోణం నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పొరుగు జిల్లాల నుంచి అధికారులతో ప్రభుత్వం ఆడిట్‌ చేయిస్తోంది.

కాశీబుగ్గ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆడిట్‌
కాశీబుగ్గ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్‌ నాగలింగేశ్వరరావు

- చలానా కుంభకోణం నేపథ్యంలో తనిఖీలు

పలాస/కాశీబుగ్గ, సెప్టెంబరు 17 : కాశీబుగ్గ గాంధీనగర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శుక్రవారం ఆడిట్‌ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్‌ నాగలింగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు. గత రెండేళ్లలో జరిగిన భూముల క్రయవిక్రయాలు, చలానా వివరాలపై ఆరాతీశారు. రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన చలానా కుంభకోణం నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పొరుగు జిల్లాల నుంచి అధికారులతో ప్రభుత్వం ఆడిట్‌ చేయిస్తోంది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ నాగలింగేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత  రిజిస్ట్రార్‌ అధికారులు ఇతర జిల్లాలకు, ఇతర జిల్లాలకు చెందినవారు ఈ జిల్లాలో ఆడిట్‌ చేస్తున్నట్టు తెలిపారు. స్టాంపుల అమ్మకాలు, రిజిస్ట్రేషన్‌ అయిన భూముల వివరాలు, వాటి మార్కెట్‌ విలువ, చలానా మొత్తం తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వీటిపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్టు తెలిపారు. మొత్తం అధికారుల బృందం రెండుగా విడిపోయి రికార్డులు, కంప్యూటర్‌లో భద్రపరిచిన డేటాను పరిశీలించారు. వీరితోపాటు కాశీబుగ్గ సబ్‌రిజిస్ట్రార్‌ భీమశంకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2021-09-18T04:49:07+05:30 IST