Audi Perukku celebrations: ఆడిపెరుక్కు వేళ మహిళల ఆనందహేల

ABN , First Publish Date - 2022-08-04T15:39:13+05:30 IST

రాష్ట్రంలో ఆడి పెరుక్కు(Audi Perukku) వేడుకలు బుధవారం ఉదయం నది, సముద్రతీరాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. కావేరి పరీవాహక ప్రాంతాల్లో మహిళలు,

Audi Perukku celebrations: ఆడిపెరుక్కు వేళ మహిళల ఆనందహేల

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో ఆడి పెరుక్కు(Audi Perukku) వేడుకలు బుధవారం ఉదయం నది, సముద్రతీరాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. కావేరి పరీవాహక ప్రాంతాల్లో  మహిళలు, నవదంపతులు పుణ్యస్నానాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో కావేరి(Kaveri) ప్రవహించే హొగెనేకల్‌ నుంచి పుంపుహార్‌ వరకు అన్ని ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అదేవిధంగా శ్రీరంగంలోని కావేరి(Kaveri) నది ఒడ్డున ఉన్న అమ్మా మండపం బుధవారం ఉదయం మహిళలతో నిండిపోయింది. కావేరి నదికి హారతులిచ్చి, నైవేద్యం సమర్పించిన అనంతరం వివాహితులు కొత్త పసుపుతాళ్ళను ధరించారు. చెన్నై మెరీనాతీరంలోనూ ఆడిపెరుక్కు వేడుకలు ఘనంగా నిర్వహించారు.  

Updated Date - 2022-08-04T15:39:13+05:30 IST