ఏపీలో ఏయూ న్యాయ కళాశాల నంబర్‌వన్‌

ABN , First Publish Date - 2021-04-13T06:15:25+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల రాష్ట్రంలో నంబర్‌వన్‌ స్థానాన్ని సాధించింది.

ఏపీలో ఏయూ న్యాయ కళాశాల నంబర్‌వన్‌

ఏయూ క్యాంపస్‌, ఏప్రిల్‌ 12: ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల రాష్ట్రంలో నంబర్‌వన్‌ స్థానాన్ని సాధించింది. జాతీయ స్థాయిలో గ్లోబల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌-కాంపిటేషన్‌ సక్సెస్‌ రివ్యూ మ్యాగజైన్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఏపీలో అత్యుత్తమ న్యాయ కళాశాలగా ఏయూలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల నిలిచింది. ఈ మేరకు వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా అత్యుత్తమ స్థానాన్ని సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ సమిత్రతోపాటు అధ్యాపకుల బృందాన్ని సోమవారం ఆయన అభినందించారు.


Updated Date - 2021-04-13T06:15:25+05:30 IST