అటెండర్లే వసూల్‌ రాజాలు

ABN , First Publish Date - 2022-01-26T05:10:31+05:30 IST

అటెండర్లే వసూల్‌ రాజాలు

అటెండర్లే వసూల్‌ రాజాలు
డబ్బులు వసూలు చేస్తున్న అటెండరు

  • యథేచ్చగా అవినీతి బాగోతం 
  • తహసీల్దార్‌ కార్యాలయంలో  డబ్బులు తీసుకుంటున్న  వైనం


చౌదరిగూడ, జనవరి 25: రెవెన్యూశాఖలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను తీసుకువచ్చింది. వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసింది. కానీ అవినీతి మారలేదని అధికారులు తమ పని కానిచ్చేస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా ఆన్‌లైన్‌ కావడంతో అధికారులు నేరుగా తీసుకోకుండా అటెండర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు మండలప్రజలు ఆరోపిస్తున్నారు. మండల తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు మీసేవా కేంద్రాలు, కామన్‌సర్సీ్‌స సెంటర్లను సంప్రదిస్తున్నారు. అక్కడ దరఖాస్తులు పూర్తిచేసి వెళ్లిపోతున్నారు. ఆతర్వాత పనులు కాలేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులకు అందాల్సింది ముడితేనే పనిఇట్టే అయిపోతుంది. దీనికోసం అధికారులు తమవద్ద పనిచేసే అటెండర్లను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఉదాహరణగా మంగళవారం ఓపని కోసం అటెండర్లు డబ్బులు తీసుకుంటూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా తమ కార్యాలయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఎప్పుడూ న్యాయం చేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-26T05:10:31+05:30 IST