ఇండియా-ఆసియా స్నేహ సంవత్సరం 2022: మోదీ

ABN , First Publish Date - 2021-10-29T00:59:37+05:30 IST

ఈరోజు జరిగిన 18వ ఆసియా-ఇండియా సదస్సుకు హాజరయ్యాను. ఆసియా భాగస్వాములతో ప్రపంచ దేశాల అంశాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక, దౌత్య పరమైన అంశాలను పంచుకున్నాము. ఆసియా దేశాల భాగస్వామ్యం మరింత బలపడేందుకు భారత్ సహకరిస్తుంది..

ఇండియా-ఆసియా స్నేహ సంవత్సరం 2022: మోదీ

న్యూఢిల్లీ: 2022 సంవత్సరం ఇండియా-ఆసియా దేశాల మధ్య స్నేహ సంవత్సరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గురువారం జరిగిన 18వ ఆసియా-ఇండియా సదస్సుకు హాజరైన మోదీ.. ఆసియా దేశాలతో భారత్‌కు ఉన్న స్నేహ, దౌత్య సంబంధాలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘమైన ఈ బంధంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కూడా ఈ దేశాల మధ్య సఖ్యమైన వాతావరణం ఉంటుందని, పరస్పర సహకారంతో ఆసియా దేశాలు పని చేస్తాయని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.


‘‘ఈరోజు జరిగిన 18వ ఆసియా-ఇండియా సదస్సుకు హాజరయ్యాను. ఆసియా భాగస్వాములతో ప్రపంచ దేశాల అంశాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక, దౌత్య పరమైన అంశాలను పంచుకున్నాము. ఆసియా దేశాల భాగస్వామ్యం మరింత బలపడేందుకు భారత్ సహకరిస్తుంది. అలాగే 30 ఏళ్ల ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022 సంవత్సరాన్ని ఇండియా-ఆసియా దేశాల మధ్య స్నేహ సంవత్సరంగా జరుపుకోవాలని సదస్సులో నిర్ణయించాం’’ అని మోదీ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-29T00:59:37+05:30 IST