హాజరు అంతంతే..

ABN , First Publish Date - 2021-02-25T05:08:02+05:30 IST

కరోనా మహమ్మా రితో మూతపడ్డ విద్యాసంస్థలు బుధవారం జిల్లా వ్యాప్తంగా 6,7,8 తరగతులను ప్రారంభించాయి.

హాజరు అంతంతే..
జగిత్యాలలో పాఠశాలకు హాజరైన విద్యార్థులు

- 6,7,8 విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం

- 11.78 శాతమే హాజరు

జగిత్యాల అర్బన్‌, ఫిబ్రవరి 24: కరోనా మహమ్మా రితో మూతపడ్డ విద్యాసంస్థలు బుధవారం జిల్లా వ్యాప్తంగా 6,7,8 తరగతులను ప్రారంభించాయి. ప్ర భుత్వ పాఠశాలల్లో 10.14 శాతం విద్యార్థులు హాజర వగా, ప్రైవేట్‌ పాఠశాలల్లో 14శాతంమంది హాజరైన ట్టు జిల్లా విద్యాశాఖ అఽధికారులు తెలిపారు. జిల్లా లో మొత్తం 580 పాఠశాలల్లో గల 6,7,8 తరగతుల కు సంబంధించిన మొత్తం 36,678 మంది విద్యార్థు లకు గానూ బుధవారం కేవలం 4,319 మంది విద్యా ర్థులు హాజరుకాగా 32,359 మంది వి ద్యార్థులు గైర్హా జరయ్యారు. మొత్తంగా 11.78 శాతం హాజరు నమో దు అయింది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు స్ర్కీ నింగ్‌ పరీక్షలు నిర్వహించి, కొవిడ్‌ నిబంధనల మేర కు తరగతి గదిలోకి అనుమతించారు. 

 కలెక్టర్‌ సమీక్ష..


జగిత్యాల టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠ శాలలో  6,7,8వ తరగతులు ప్రారంభమైన నేపథ్యం లో కట్టుదిట్టమైన కొవిడ్‌ నిబంధనలతో తరగతులు నిర్వహించాలని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. తరగతుల నిర్వహణ, తీసుకునే చర్యలపై బుధవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజే షం, అరుణశ్రీ, డీఈవో జగన్‌మోహన్‌ ఉన్నారు.

 కొవిడ్‌ నిబంధనలను పాటించాలి..


మెట్‌పల్లి రూరల్‌/కోరుట్ల రూరల్‌: పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ఉపాధ్యాయుల ను అదనపు కలెక్టర్‌ రాజేశం ఆదేశించారు. బుధవారం మెట్‌పల్లి రూరల్‌, కోరుట్ల రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల తరగతి గదులను శానిటేషన్‌ చేసి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచాలని సూచించారు. ఎంపీడీవో కల్పన, స ర్పంచ్‌లు మ్యాకల అర్చనాసుదర్శన్‌, గడ్డం లింగా రెడ్డి, వనతడుపుల అంజయ్య, పిడుగు రాఽధాసంద య్య, ఉపసర్పంచ్‌ ముత్యంరెడ్డి, ఎంపీవో మహేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:08:02+05:30 IST