Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళపై మరో అరాచకం..!

ప్రకాశం: జిల్లాలోని వెనిగండ్ల మండలం గుడిపాటిపల్లెలో వెంటటేశ్వర్లు అనే వైసీపీ నేతపై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తాయి. తాను బహిర్భూమికి వెళ్లిన సమయంలో వైసీపీ నేత వెంకటేష్.. తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని గురువమ్మ అనే మహిళ ఆరోపించింది. తాను ప్రతిఘటించడంతో దాడి చేసి, గాయపరచి పరారయ్యాడని వాపోయింది. గతంలో కూడా ఓ సారి తాను పశువుల మేత కోసం పొలానికి వెళ్తే.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. అప్పడు తాను తిట్టడంతో వెళ్లిపోయాడని.. అది మనసులో పెట్టుకుని మళ్లీ ఇప్పుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పకొచ్చింది. గాయపడిన మహిళను సాటి మహిళలు ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement