అల్వాల ఉపసర్పంచ భర్తపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-19T06:22:27+05:30 IST

పాతకక్షలను మనుసులో పెట్టుకొని మండ లంలోని అల్వాల గ్రామ ఉపసర్పంచ భర్తపై హత్యాయత్నం చేశారు.

అల్వాల ఉపసర్పంచ భర్తపై హత్యాయత్నం

తిరుమలగిరి(సాగర్‌), ఆగస్టు 18: పాతకక్షలను మనుసులో పెట్టుకొని మండ లంలోని అల్వాల గ్రామ ఉపసర్పంచ భర్తపై హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో నిందితుడిని సీఐ నాగరాజు నేతృత్వంలో గురువారం రిమాండ్‌కు తరలించారు. సాగ ర్‌ సర్కిల్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున గ్రామంలో పీర్లపండుగ జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రావులపాటి కొండలు.. ఉపసర్పంచ భర్త షేక్‌ జానిమియాను బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నంచేయగా, పారిపోయాడు. అనంతరం గాయపడిన జానిమియాను అల్వాల ఎక్స్‌రోడ్డులోని ఓప్రైవేట్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం సాగర్‌ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై ఎస్‌ఐ పెదపంగ బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  



Updated Date - 2022-08-19T06:22:27+05:30 IST