బాసరలో రైల్‌రోకోకు యత్నం

ABN , First Publish Date - 2021-10-19T06:40:21+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్‌ జిల్లా బాసరలో రైల్‌రోకోకు యత్నించారు.

బాసరలో రైల్‌రోకోకు యత్నం
రైల్వేస్టేషన్‌ వద్ద నినాదాలు చేస్తున్న నాయకులు

ఏఐకేఎంఎస్‌ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

బాసర, అక్టోబరు 18 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్‌ జిల్లా బాసరలో రైల్‌రోకోకు యత్నించారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు రైల్‌రోకోకు యత్నించిన నాయకులను అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా రైల్వేస్టేషన్‌ ఎదుట బైఠాయించి ఏఐకేఎంఎస్‌ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బాసర ఎస్సై ప్రేమ్‌దీప్‌ ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనలో ఏఐకేఎంఎస్‌ నాయకులు నూతన్‌ కుమార్‌, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:40:21+05:30 IST