గుప్త నిధుల కోసం తవ్వకాలకు యత్నం

ABN , First Publish Date - 2022-05-19T06:34:13+05:30 IST

నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి శివారు ప్రాంతంలో ఉన్న ఉమమహేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వ కాలకు పలువురు యత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పట్టు కొని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుభీర్‌ మండలం కచ్ర గ్రామానికి చెందిన రెడ్డిమహరాజ్‌ సూచన మేరకు అదే జిల్లా భైౖంసా మండలం తుంగిలి గ్రామానికి చెందిన బర్కుంట నవీన్‌ ఆ యనకు వరుసకు బావ అయ్యే ప్రదీప్‌లు గుప్త నిధుల కోసం తవ్వకాలకు యత్నించారు. దీన్ని గమనించిన ఆలయ పూజరి గ్రామస్థులకు సమాచారం అందించారు. మరుసటి రోజు పలువురు ఆలయం చుట్టు పక్కల మాటు వేశారు. అదే సమయంలో ఆలయానికి నిధుల తవ్వకోసం వచ్చిన బ రుకుంట నవీన్‌ను గ్రామస్థులు పట్టుకున్నారు. మిగతా ఇద్దరు వ్యక్తులు ప రారీ అయ్యారు. పట్టుకున్న బర్కుంట నవీన్‌ను చితకబాది పోలీసులకు అ ప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలకు యత్నం

నందిపేట, మే18: నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి శివారు ప్రాంతంలో ఉన్న ఉమమహేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వ కాలకు పలువురు యత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పట్టు కొని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుభీర్‌ మండలం కచ్ర గ్రామానికి చెందిన రెడ్డిమహరాజ్‌ సూచన మేరకు అదే జిల్లా భైౖంసా మండలం తుంగిలి గ్రామానికి చెందిన బర్కుంట నవీన్‌ ఆ యనకు వరుసకు బావ అయ్యే ప్రదీప్‌లు గుప్త నిధుల కోసం తవ్వకాలకు యత్నించారు. దీన్ని గమనించిన ఆలయ పూజరి గ్రామస్థులకు సమాచారం అందించారు. మరుసటి రోజు పలువురు ఆలయం చుట్టు పక్కల మాటు వేశారు. అదే సమయంలో ఆలయానికి నిధుల తవ్వకోసం వచ్చిన బ రుకుంట నవీన్‌ను గ్రామస్థులు పట్టుకున్నారు. మిగతా ఇద్దరు వ్యక్తులు ప రారీ అయ్యారు. పట్టుకున్న బర్కుంట నవీన్‌ను చితకబాది పోలీసులకు అ ప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2022-05-19T06:34:13+05:30 IST