అట్టహాసంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-25T05:55:03+05:30 IST

మండల పరిధిలోని మాద్వార్‌ తండాలో విశ్వపాలిని జ్వాలాముఖి భవానీమాత, సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
మాద్వార్‌ తండాలో బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్న మహిళలు

నారాయణఖేడ్‌, మే 24: మండల పరిధిలోని మాద్వార్‌ తండాలో విశ్వపాలిని జ్వాలాముఖి భవానీమాత, సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం గంగపూజ, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, బోనాలతో విగ్రహాలను ప్రదర్శన గణపతి, గౌరీ, స్వాస్తి, పుణ్యాహవాచకం, అగ్నిస్థాపనం, హోమాలు, చండీపారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్‌ చౌహాన్‌, స్థానిక బాధ్యులు రాజునాయక్‌తో పాటు తండావాసులు పాల్గొన్నారు. కాగా ఖేడ్‌ పట్టణంలోని చారిత్రాత్మకమైన రామాలయంలో మంగళవారం నవమిని పురస్కరించుకొని సీతారామచందుల్రకు అభిషేకం, దాతల సహకారంతో మహాప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. 

Updated Date - 2022-05-25T05:55:03+05:30 IST