అట్టహాసంగా పూల పండుగ

ABN , First Publish Date - 2022-09-26T04:54:31+05:30 IST

ఈ రోజు నుంచి ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు ఆక్టోబరు 3 వరకు నిర్వ హించుకుంటామని, ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుం దామని జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవర్‌ పేర్కొ న్నారు.

అట్టహాసంగా పూల పండుగ
బతుకమ్మకు పూజలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్‌ నందలాల్‌ పవర్‌

- మొదటి రోజు బతుకమ్మ వేడుకలు ప్రారంభం

- పాల్గొన్న అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవర్‌

- కోలాటం, బొడ్డెమ్మ ఆడిన ఉద్యోగినులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 25 : ఈ రోజు నుంచి ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు ఆక్టోబరు 3 వరకు నిర్వ హించుకుంటామని, ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుం దామని జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవర్‌ పేర్కొ న్నారు. ఆదివారం జిల్లా పరిషత్‌ మైదానంలో జిల్లా శిశు సంక్షే మ శాఖ, వైద్య శాఖ, డీఆర్‌డీఏ, బీసీ వెల్ఫేర్‌ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా తేజస్‌నందలాల్‌ పవర్‌ పాల్గొని ప్రసంగించారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రతీ రోజు సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ వేడు కల్లో ఉద్యోగులు ఆడుతూ పాడుతూ ఉత్సవంగా నిర్వహించు కోవాలని కోరారు. ప్రతీ రోజు బహుమతులు ఉంటాయని తెలి పారు. ప్రతీ రోజు దేవాదాయ శాఖ ప్రసాదం పంపిణీ చేస్తుందని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనే వారికి అన్ని వసతులు కల్పిస్తారని తెలిపారు. అనంతరం బతుకమ్మ లకు పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. మైదా నమంతా కలియ తిరుగుతూ బతుకమ్మ ఆటను పరిశీలించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవా లలో మహిళా ఉద్యోగులు హుషారుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్ర మంలో డీఆర్‌డీవో పీడీ యాదయ్య, హౌసింగ్‌ పీడీ వైద్యం భాస్కర్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రం మర్లులోని భాగ్యలక్ష్మి కాలనీలో బతుకమ్మ సంబురాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.



Updated Date - 2022-09-26T04:54:31+05:30 IST