అట్టహాసంగా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-14T05:02:42+05:30 IST

అట్టహాసంగా వజ్రోత్సవాలు

అట్టహాసంగా వజ్రోత్సవాలు
అన్నోజిగూడలో జరిగిన ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి

  •    ఇళ్లపై రెపరెపలాడుతున్న జాతీయ జెండాలు
  •    ర్యాలీలు, తివర్ణ పతాకాలతో రహదారులకు శోభ 

కీసర రూరల్‌/ఘట్‌కేసర్‌/మేడ్చల్‌/వికారాబాద్‌13, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌, మేడ్చల్‌జిల్లాల్లో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.ఇళ్లు, కార్యాలయాలపై త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. శనివారం ఆయా జిల్లాల్లో ఫ్రీడం ర్యాలీలు నిర్వహించారు.  సంబ్బండ వర్గాల ప్రజలు ర్యాలీల్లో పాల్గొన్నారు. వందేమాతరం, భారత్‌మాతాకీ జై, సారే జహాసే అచ్చా హిందుస్తాన్‌ హమారా అనే నినాదాలతో  మార్మోగింది. ఘట్‌కేసర్‌లోని యంనంపేట్‌ చౌరస్తా నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు జరిగిన భారీ ర్యాలీలో, పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో జరిగిన ఫ్రీడం ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కీసర కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా అధికారులు, సిబ్బంది, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ఫ్రీడం ర్యాలీలో, అనంతరం దళితబంధు లబ్ధిదారులు  చేపట్టిన ర్యాలీ జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ హరీశ్‌  పాల్గొన్నారు. వికారాబాద్‌ పట్టణంలో ఎంఆర్‌పీ చౌరస్తా నుండి బ్లాక్‌ గ్రౌండ్‌ వరకు నిర్వహించిన ప్రీడమ్‌ ర్యాలీని జిల్లా కలెక్టర్‌ నిఖిల జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 14న ఆదివారం స్థానిక బ్లాక్‌ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు జానపద కళాకారులతో సంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో  కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2022-08-14T05:02:42+05:30 IST