మహిళలపై దాడులను ఉపేక్షించేది లేదు

ABN , First Publish Date - 2020-07-02T10:55:53+05:30 IST

మహిళలపై దాడులు, వేధింపులను ఉపేక్షించేంది లేదని, సత్వరమే న్యాయం జరిగేలా సఖి కేంద్రం పని చేయాలని కలెక్టర్‌ కృష్ణభా స్కర్‌

మహిళలపై దాడులను ఉపేక్షించేది లేదు

సఖి కేంద్రంతో మహిళలకు సత్వర న్యాయం

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

సఖి సమన్వయ కమిటీ సమావేశం


సిరిసిల్ల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మహిళలపై దాడులు, వేధింపులను ఉపేక్షించేంది లేదని, సత్వరమే న్యాయం జరిగేలా సఖి కేంద్రం పని చేయాలని కలెక్టర్‌ కృష్ణభా స్కర్‌ అన్నారు. బుధవారం  కలెక్ట రేట్‌లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పోలీ స్‌ శాఖ అధికారులు, సఖి కేంద్రం నిర్వాహకులతో సఖి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మహిళలపై దాడులు, గృహహింస, అత్యాచారాలు, పనిచేసే చోట వేధింపులు, పిల్లల అక్రమ రవాణాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయనప్పుడు సుమో టోగా కేసు స్వీకరించాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. సఖి కేంద్రంలో లైంగిక వేధింపుల కేసు నమోదు, పరిష్కార రిజిస్టర్‌లను మెయిన్‌టేయిన్‌ చేయాలన్నారు. మహిళలకు  హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. ఒకే చోట సహకారాన్ని అందించడానికి సఖి కేంద్రం వన్‌ స్టాప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, 181 హెల్ప్‌లైన్‌ను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.


ఎస్పీ రాహుల్‌  హెగ్డే  మాట్లాడుతూ బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు పోలీసులు పూర్తి  సహకారం అందిస్తారన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ఒకరికి సమన్వయ కర్త బాధ్యతలను అప్పగిస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ అంజయ్య మాట్లాడుతూ జిల్లాలో గతేడాది నవంబరున సఖి కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి 90 కేసులు నమోదయ్యాయన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో 44 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  సఖి కేంద్రం నిర్వాహకులు రోజా సఖి కేంద్రం నిర్వహణపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అంతకుముందు సఖి కేంద్రం సేవలపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, డీఈవో రాధాకిషన్‌, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T10:55:53+05:30 IST