షాపింగ్‌ మాల్స్‌పై దాడులు

ABN , First Publish Date - 2022-01-13T05:38:11+05:30 IST

సంక్రాంతి పండుగ వేళ.. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లాలో నిబంధనలు పాటించని షాపింగ్‌ మాల్స్‌పై బుధవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ ప్రాంతా ల్లో ఐదు షాపింగ్‌ మాల్స్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించని కారణంగా అపరాధ రుసుం విధించారు.

షాపింగ్‌ మాల్స్‌పై దాడులు
పలాస : షాపింగ్‌ మాల్‌లో తనిఖీ చేస్తున్న అధికారులు

జిల్లాలో ఐదు దుకాణాలకు అపరాధ రుసుం 

కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక

పలాస/గుజరాతీపేట, జనవరి 12 :  సంక్రాంతి పండుగ వేళ.. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లాలో నిబంధనలు పాటించని షాపింగ్‌ మాల్స్‌పై బుధవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ ప్రాంతా ల్లో ఐదు షాపింగ్‌ మాల్స్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించని కారణంగా  అపరాధ రుసుం విధించారు. శ్రీకాకుళం నగరంలో టౌన్‌ప్లానింగ్‌, ప్రజారోగ్య అధికారులతో కలిసి కమిషనర్‌ ఓబులేసు వివిధ షాపింగ్‌ మాల్స్‌ను పరిశీలిం చారు. మూడు షాపింగ్‌ మాల్స్‌లో నిబంధనలను అతిక్రమించి.. భారీగా వినియోగదారులను షాపులోకి అనుమతించినట్టు గుర్తించారు. ఈ మేరకు   మూడు షాపింగ్‌ మాల్స్‌కు రూ.15వేల చొప్పున అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హెచ్చ రించారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే ఒక్కో షాపుపై రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జరిమానా విధించడంతో పాటు షాపులను సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని షాపింగ్‌ మాల్స్‌లో మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. రెండు షాపింగ్‌ మాల్స్‌ నుంచి రూ.20వేలు అపరాధ రుసుం వసూలు చేశామని కమిషనర్‌ వెల్లడించారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయని కమిషనర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో మునిసిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ బళ్ల గిరిబాబు అధ్యక్షతన అర్బన్‌ హెల్త్‌సెంటర్ల సిబ్బందితో కమిషనర్‌ రాజగోపాలరావు, తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావులు అత్యవసరంగా సమావేశమయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సిబ్బంది సెలవులు పెట్టకుండా ఇంటింటా సర్వే నిర్వహించా లని ఆదేశించారు. కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా మూడోదశ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఆసుపత్రుల్లో తగిన బెడ్లు, ఆక్సిజన్‌ సిద్ధంగా ఉందని, ఎవరూ అధైర్యపడవద్దని చైర్మన్‌ గిరిబాబు తెలిపారు. 

Updated Date - 2022-01-13T05:38:11+05:30 IST