రాష్ట్రంలో పెరిగిన దళితులపై దాడులు

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగా యని టీడీపీ ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వలపర్ల సుబ్బారావు అన్నారు.

రాష్ట్రంలో పెరిగిన దళితులపై దాడులు
పర్చూరులో అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న దళిత నాయకులు

అద్దంకి, మే 22: వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగా యని టీడీపీ ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వలపర్ల సుబ్బారావు అన్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు  కారు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో  నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కుటుంబసభ్యులకు న్యాయం  చేయాలని  డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో ఎస్సీ సెల్‌ నేతలు  మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం మృతిపై  ని జ నిర్ధారణ కోసం కాకినాడ జీజీహెచ్‌ దగ్గరకు వెళ్ళిన కమిటీ సభ్యుడు ఎమ్మెస్‌ రాజుపై జరిగిన దాడిని ఖండించారు. వైసీపీ అరాచకాలకు తగిన  బుద్ధి చెబుతామన్నారు. సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్‌ నేత లు అంకం నాగరాజు, మల్లవరపు దిలీప్‌కుమార్‌, మున్నంగి స్టాలిన్‌, జ్యోతి రామారావు, అమర్తలూరి ఏసోబు(చిన్నా), గోవాడ శ్రీకాంత్‌, మందా నాగేశఽ్వరరావు, ఆమోస్‌, కరి  పరమేష్‌, చిన్ని శ్రీనివాసరావు, వడ్డవల్లి పూర్ణచంద్రరావు, మన్నం త్రిమూర్తులు,  కుందారపు  రామా రావు, లహరి, శివ ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


యువకుడి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

పర్చూరు, మే 22: వైసీపీ ప్రభుత్వం దళితులపై దాడులు, హత్యలకు పాల్పడుతుందని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బేతపూడి సురేష్‌ ఆరోపించారు. దళిత యువకుడు సుబ్ర హ్మణ్యం హత్యకు నిరసనగా ఆదివారం దళిత సంఘం ఆధ్వర్యంలో స్ధానిక టీడీపీ కార్యాలయం నుంచి కళ్ళకు గంతలు కట్టుకొని పర్చూరు బొమ్మల సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బొమ్మల సెంటర్‌ కూడలిలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ దళిత నేతలు మోకాళ్ళపై నిల్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి తినతి పత్రం అందజేశారు. ఈ సందర్భగా బేతపూడి సురేష్‌ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం మృతికి కారణమైన వైసీపీ కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాల న్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.

 కార్యక్రమంలో దేవతోటి నాగరాజు. దాసి కిరణ్‌, కేశానపల్లి శ్యామ్‌, పావులూరి రవిచంద్ర, బే తుల రాజేష్‌, చుండూరి కిషోర్‌బాబు, తమ్ములూరి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST