కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు

ABN , First Publish Date - 2021-06-25T06:42:53+05:30 IST

పెద్దపప్పూరు మండలం జూ టూరు గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై గురువా రం ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్‌ సిబ్బందితో కలసి దాడులు చేశా రు.

కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు
స్వాధీనం చేసుకున్న కల్తీపాలు, నూనె పాకెట్లు

తాడిపత్రి, జూన 24: పెద్దపప్పూరు మండలం జూ టూరు గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై గురువా రం ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్‌ సిబ్బందితో కలసి దాడులు చేశా రు. ఈసందర్భంగా 30 లీటర్ల సనఫ్లవర్‌ ఆయిల్‌ పాకెట్లు, 30 లీటర్ల పాలు, 20 లీటర్ల కల్తీ పాలు, మిక్సీ, జార్‌, రెం డు పాలక్యాన్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలకుళ్లాయప్పను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలివి. జూటూరు గ్రామానికి చెందిన బాలకుళ్లాయప్ప రెండు సంవత్సరాలుగా ఇంట్లో కల్తీ పాలు తయారుచేస్తున్నాడు. 2 లీటర్ల పాలు, రెండు లీటర్ల సనఫ్లవర్‌ ఆయిల్‌ను కలిపి మిక్సీలో ఆడించి అనంతరం చిక్కగా వచ్చిన ద్రవాన్ని నీరుపోసి 20 లీటర్ల కల్తీ పాలుగా మార్చేవాడు. ఈ కల్తీపాలను తాడిపత్రి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేసేవాడు. ఉదయం 20 లీట ర్లు, మధ్యాహ్నం 20 లీటర్ల పాలను విక్రయించేవాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితునితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఫుడ్‌సేఫ్టీ అధికారులకు అప్పగించనున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-06-25T06:42:53+05:30 IST