నాగర్ కర్నూల్: జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాలలోని కృష్ణా నదీ తీర ప్రాంతంలో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు దాడులు చేశారు. నిషేధిత అలివి వలలు ఉన్న స్థావరాలపై దాడులు చేశారు. ఆంధ్ర జాలరుల గుడారాలను పోలీసులు, మత్స్యశాఖ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వలలను ఉపయోగించి తెలంగాణ వైపున అక్రమంగా చేపలను పడుతున్నారనే సమాచారం అధికారులకు అందింది.