విలేకరులతో మాట్లాడుతున్న చిలకం మధుసూదనరెడ్డి
ధర్మవరం, జూన 29: రాజకీయ విమర్శలను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొవాలే తప్ప.. దాడులు చేయ డం హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక తన గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నాయకులపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరికైనా మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. పట్టపగలే ఇలా దాడులు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు బెస్త శ్రీనివాసులు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.