బావమరిదిపై బావ కత్తితో దాడి

ABN , First Publish Date - 2022-04-04T17:43:45+05:30 IST

జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించి ఇంటికి ఆలస్యంగా..

బావమరిదిపై బావ కత్తితో దాడి

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని బావమరిదిని బావ మందలించాడు. మద్యం మత్తులో ఉన్న బావమరిది.. బావను అనుచిత పదజాలంతో దూషించాడు. కోపంతో రగిలిపోయిన బావ కూరగాయలు కోసే కత్తితో బావమరిదిపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితున్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-04T17:43:45+05:30 IST