అమరావతి: గుడివాడలో టీడీపీ నేతలపై దాడి దుర్మార్గమని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. గుడివాడను మట్కా, వ్యసనాలకు కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. కేసినో గుట్టు బయట పడుతుందనే భయంతోనే గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం సృష్టించిందని మండిపడ్డారు. కొడాలి నాని కోడె త్రాచులా యువతను నాశనం చేస్తున్నాడని, మంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి