Hyderabad: యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడిపై దాడి

ABN , First Publish Date - 2022-06-23T14:51:50+05:30 IST

యూ-ట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌పరిధిలో

Hyderabad: యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడిపై దాడి

హైదరాబాద్/జవహర్‌నగర్‌: యూ-ట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. యూ ట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడిగా జవహర్‌నగర్‌వాసులకు చిరపరిచితుడైన అరుణ్‌కుమార్‌ త్యాగిపై పోలీ్‌సస్టేషన్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.. మహిల లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. బుధ వారం కిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకోసం తన కారులో వెళ్తున్న క్రమంలో జమ్మిగడ్డవద్ద ముగ్గురు వ్యక్తులు అడ్డుకొని త్యాగిపై కర్రలతో దాడి చేసి  పారిపోయారు. స్థానికులు డయల్‌  100కు ఫోన్‌ చేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-06-23T14:51:50+05:30 IST