మహిళపై గొడ్డలితో దాడి చేసిన యువకుడు

ABN , First Publish Date - 2022-05-03T12:35:28+05:30 IST

చుంచుపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు నవతన్..భూక్య శ్రీదేవి అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల

మహిళపై గొడ్డలితో దాడి చేసిన యువకుడు

భద్రాద్రి కొత్తగూడెం: చుంచుపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు నవతన్..భూక్య శ్రీదేవి అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా మహిళపై అతికిరాతకంగా గొడ్డలితో యువకుడు దాడికి పాల్పడ్డాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more