టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నిరసన

ABN , First Publish Date - 2021-10-20T07:07:22+05:30 IST

టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ సర్కిల్‌లో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు.

టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నిరసన

కదిరి ,  అక్టోబరు 19: గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ మంగళవారం టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ సర్కిల్‌లో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రోజు రోజుకు దాడులు, అరాచకాలు పెరిగి పోతు న్నాయన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహం పై వైసీపీ గుండాలు దాడి చేయడం మరువక ముందే టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి చేయడం చూస్తే వైసీపీ పాలనలో వైసీపీ గుండాయిజం ఏపాటితో స్పష్టమవుతోందన్నారు. దాడి చేసిన వైసీపీ నాయ కులను వెంటనే అరెస్టు చేసి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆల్ఫా ముస్తఫా, టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్‌బాబ్‌జాన్‌, అధికార ప్రతినిధి బండారు మనోహర్‌నాయుడు, టీడీపీ నాయకులు జావెద్‌, రమణ, రాజశే ఖర్‌బాబు, నరసింహులు, ఇమ్రాన్‌, ఇర్ఫాన్‌, నాగ, పాల రమణ, మహేంద్ర, అతహర్‌,  మహిళా నాయకురాళ్ళు పీట్ల రమణమ్మ, ఉమాదేవీ, గంగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. 

తలుపుల: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యా లయంపై వైసీపీ గూండాలు దాడులను నిరసిస్తూ మంగళవారం రాత్రి తలుపుల మూడురోడ్ల కూడలిలో  తెలుగుదేశం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నా యకులు మాట్లాడుతూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాస గృహం పైన , హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ నివాస గృహంపై, వివిధ జిల్లాలోని టీడీపీ కార్యాలయాలపై దాడులు నిర్వహించడం పిరికిచర్యన్నారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ మిన్నకుండి పోవడం శోచనీయమన్నారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, లగిడి జయచంద్ర, రాజారెడ్డి, మహేశ్వర, కొట్టె బాలక్రిష్ణ, శ్రీనివాసులు, అజంతుల్లా, లోకేశ్వర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T07:07:22+05:30 IST