ఆస్తి పంచలేదని తండ్రిపై దాడి

ABN , First Publish Date - 2020-05-31T10:07:21+05:30 IST

ఆస్తి పంచలేదని తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గొల్లప్రోలుకు చెందిన చక్కపల్లి విశ్వనాథానికి ఇద్దరు

ఆస్తి పంచలేదని తండ్రిపై దాడి

గొల్లప్రోలు, మే 30: ఆస్తి పంచలేదని తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గొల్లప్రోలుకు చెందిన చక్కపల్లి విశ్వనాథానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తి పంచి తన వాటా తనకు ఇచ్చేయాలని పెద్దకొడుకు నరేష్‌ తండ్రిని అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా ఆస్తి ఇవ్వడం లేదనే కోపంతో శనివారం నరేష్‌ తండ్రిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అతనిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ రామలింగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Updated Date - 2020-05-31T10:07:21+05:30 IST