విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ పై దాడి

ABN , First Publish Date - 2020-03-29T11:33:23+05:30 IST

కోటబొమ్మాళి రైతుబజారు సమీపంలో శనివారం విధి నిర్వహ ణలో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ భైరి జీవరత్నంపై టెక్కలి

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ పై దాడి

ఆస్పత్రిలో ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శ


కోటబొమ్మాళి, మార్చి 28: కోటబొమ్మాళి రైతుబజారు సమీపంలో శనివారం విధి నిర్వహ ణలో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌  భైరి జీవరత్నంపై టెక్కలి మండలం పరశురాంపురా నికి చెందిన వాకాడ వినీత్‌, తండ్రి శ్రీనివాసులుతో కలిసి దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వివ రాలిలా ఉన్నాయి.. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కర్ఫ్యూ సమయంలో ద్విచక్ర వాహ నంపై ఈ ఇద్దరు ప్రయాణిస్తున్నారు. దీంతో వారిని నిలువరించి ఇద్దరు ప్రయాణించ వద్దని చెబుతున్న కానిస్టేబుల్‌పై ఈ ఇరువురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. వినీత్‌ కానిస్టేబుల్‌  చేతులోని లాటీని నులుపుకొని కొడుతుండగా వినీత్‌ తండ్రి శ్రీనివాసరావు రాళ్లను జీవరత్నం తలపైకి విసరడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆతడిని సామాజిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిం చారు. ఈ మేరకు ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు. 


ఎస్పీ పరామర్శ

సంఘటన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి వెంటనే స్థానిక సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీవరత్నంను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ ప్రకటించాయన్నారు.


కర్ఫ్యూ 144 సెక్షన్‌ అమలులో పోలీసు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని, వారిని అభినందించక పోయినా ఫరవాలేదు.. కాని దాడులు చేయవద్దని కోరారు. ఇలా పోలీసులపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ఏప్రిల్‌ 14 వరకు స్వీయ నిర్బంధంలో ప్రజలంతా ఉండాలని కోరారు.   ఆయన వెంట ఎస్సీ స్పెషల్‌ బ్రాంచి సీఐ శ్రీనివాసరావు, టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణ్‌ ఉన్నారు. 

Updated Date - 2020-03-29T11:33:23+05:30 IST