తహసీల్దార్‌పై దాడి : ఐదుగురిపై కేసు

ABN , First Publish Date - 2020-05-21T09:09:43+05:30 IST

మల్హర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సిబ్బందిపై బుధవారం దాడి జరిగింది. మండలంలోని అడ్వాల్‌పల్లిలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌,

తహసీల్దార్‌పై దాడి : ఐదుగురిపై కేసు

మల్హర్‌, మే 20 : మల్హర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సిబ్బందిపై బుధవారం దాడి జరిగింది. మండలంలోని అడ్వాల్‌పల్లిలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ అధికారులతో తొలుత గ్రామస్థులు ఐదుగురు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కర్రలతో దాడి చేశారు. దీంతో తహసీల్దార్‌తోపాటు ఎక్సైజ్‌ సిబ్బంది పలువురికి  గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని చేరుకున్న కొయ్యూర్‌ ఎస్సై ఇస్లావత్‌ నరేష్‌ విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన అజ్మీరా నవీన్‌, అజ్మీరా దేవేందర్‌, బానోతు సాగర్‌, అజ్మీరా కల్యాణి, అజ్మీరా రజితపై కేసు నమోదు చేశారు.


కఠిన చర్య తీసుకుంటాం : కలెక్టర్‌ 

రెవెన్యూ అధికారులపై దాడు చేసే వారిపై కఠినంగా చర్య తీసుకుంటామని కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాను గుడుంబా రహితంగా మార్చే క్రమంలో బుధవారం మల్హర్‌  మండలంలో తనిఖీ చేసిన తహసీల్దార్‌ శ్రీనివా్‌సపై దాడి చేయడం హేయమని పే ర్కొన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Updated Date - 2020-05-21T09:09:43+05:30 IST