రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి

ABN , First Publish Date - 2022-08-16T06:32:36+05:30 IST

పట్టణంలోని బీమునిదుబ్బ ప్రాంతంలో రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారితో పాటు ఆయన కూతురుపై దాడి జరిగిన ఘటన సోమవారం సంచలనం రేపింది. భూతగాదాలే దాడికి కారణంగా తెలుస్తోంది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి
గాయాలపాలైన తోకల జనార్థన్‌

తండ్రి, కూతూరికి గాయాలు

భూతగాదాలే కారణం

కోరుట్ల, ఆగస్టు 15 : పట్టణంలోని బీమునిదుబ్బ ప్రాంతంలో రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారితో పాటు ఆయన కూతురుపై దాడి జరిగిన ఘటన సోమవారం సంచలనం రేపింది. భూతగాదాలే దాడికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం బీముని దుబ్బ ప్రాతంలో నివాసం ఉంటున్న తోకల జనార్దన్‌17 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వెంకట నర్సయ్యకు రూ. 6 లక్షలు తీసుకోని 9 గుంటల భూమిని విక్రయించాడు. ఇప్పటి వరకు భూమి రిజిస్ట్రేషన్‌ కా లేదు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం వెంకట నర్సయ్య, భా ర్య పద్మ, కుమారుడు ప్రసాద్‌ జనార్దన్‌ ఇంటికి వెళ్లారు. భూమి విషయం మాట్లాడుతుండగానే గొడవ చోటు చేసుకుంది. జనార్దన్‌, వెంకటనర్సయ్య కు టుంబ సభ్యులు మద్య గొడవ జరిగి వెంకట నర్సయ్యతో పాటు భార్య పద్మ, ప్రసాద్‌లు అక్కడే ఉన్న కత్తెరను తీసుకోని జనార్దన్‌తో పాటు ఆమె కూతురు మదురిమపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన జ నార్దన్‌ భార్య పద్మజా, రోహిత్‌ అడ్డుకున్నారు. దాడిలో వారికి కూడా స్వల్ప గాయలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే వెంకట నర్సయ్య కుంటుబ స భ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జనార్దన్‌తో పాటు మదిరిమను స్థానిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండంతో మెరుగైన చికిత్స నిమిత్తం తండ్రి కుమార్తెను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు, ఎస్‌ఐలు సతీష్‌, శ్యామ్‌రాజుల పరిశీలన జరిపి వెంకటనర్సయ్య కు టుంబ సభ్యులను అదుపోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-08-16T06:32:36+05:30 IST