సంగీత దర్శకుడిపై దాడి

ABN , First Publish Date - 2020-10-02T08:13:59+05:30 IST

ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ముగ్గురు కలిసి వర్ధమాన సినీ సంగీత దర్శకుడిపై దాడి చేసి గాయపర్చారు

సంగీత దర్శకుడిపై దాడి

బంజారాహిల్స్‌, అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ముగ్గురు కలిసి వర్ధమాన సినీ సంగీత దర్శకుడిపై దాడి చేసి గాయపర్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌-63/ఏలో నివాసముండే అగస్త్య బోయలపల్లి సంగీత దర్శకుడు. పలు చిన్న సినిమాలకు సంగీతం అందించాడు. గత నెల 9న అతడు ఇంట్లో ఉండగా చిట్టి నాగార్జునరెడ్డి, చిట్టి అనుషారెడ్డి, చిట్టి శ్రావ్య తలుపు కొట్టారు. అతను బయటకు రాగానే ముగ్గురు కలిసి అతడిపై దాడి చేశారు. రెండు సెల్‌ఫోన్లను పగులకొట్టారు. వారి నుంచి తప్పించుకున్న అగస్త్య ఆస్పత్రిలో చేరాడు. కుడి చేయి ఫాక్చర్‌ కావడంతో చికిత్స పూర్తయిన తర్వాత గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-02T08:13:59+05:30 IST