బోధన్‌లో మున్సిపల్‌ కార్మికులపై దాడి

ABN , First Publish Date - 2020-07-05T11:23:38+05:30 IST

బోధన్‌ పట్టణంలోని సరస్వతీనగర్‌ రోడ్డులో ఆక్రమణల తొలగింపు సందర్భంగా చోటు చేసుకు న్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

బోధన్‌లో మున్సిపల్‌ కార్మికులపై దాడి

ఆక్రమణల తొలగింపులో వివాదం

కార్మికులపై హోటల్‌ యజమాని దాడి

కార్మిక సంఘాల ఆందోళన

హోటల్‌ యజమానితో పాటు అతని కుమారులపైనా కేసు నమోదు


బోధన్‌, జూలై 4: బోధన్‌ పట్టణంలోని సరస్వతీనగర్‌ రోడ్డులో ఆక్రమణల తొలగింపు సందర్భంగా చోటు చేసుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొత్త బస్టాండ్‌ నుంచి నల్లపోచమ్మ ఆలయం వరకు సరస్వతీ నగర్‌ రోడ్డు లో మున్సిపల్‌ అధికారులు ఆక్రమణలను తొలగిస్తు రోడ్లపై నిర్మాణం చేపట్టిన షెడ్లు, వంతెనలు, ర్యాంపులను జేసీబీల తో తొలగించారు. ఓ హోటల్‌ను తొలగించే క్రమంలో హోట ల్‌ యజమాని, అతని కుమారులకు మున్సిపల్‌ కార్మికుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో మున్సిపల్‌ కా ర్మికులు పర్వయ్య, రాజు, పోశెట్టి, ఎం.రాజు, బాలయ్యపై హోటల్‌ యజమానితోపాటు అతని కుమారులు దాడి చేశా రు. మాటమాట పెరిగి ఘర్షణలకు దారి తీయడంతో పరిస్థి తి ఉద్రిక్తంగా మారింది.


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేం దుకు ప్రయత్నించారు. కాగా, మున్సిపల్‌ కార్మికులపై చేయి చేసుకోవడంతో తోటి కార్మికులు, కార్మిక సంఘాల నా యకులు అక్కడికి చేరు కొని రోడ్డుపై బైఠాయించారు. కార్మికులపై దాడిచే సిన వ్యక్తులను అరెస్టు చే యాలని డిమాండ్‌ చేశారు. దీం తో మున్సిపల్‌ కమిషనర్‌ రామ లింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ హోటల్‌ యజమా నితోపాటు అతని కుమారులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాకేష్‌గౌడ్‌ తెలి పారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మున్సిపల్‌ కార్మి కులను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూరి శ్రీనివాస్‌, సీఐటీయూ నాయకులు శంకర్‌గౌడ్‌, యేశాల గంగాధర్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు మల్లేష్‌ పరామర్శించారు. 

Updated Date - 2020-07-05T11:23:38+05:30 IST