సింగపూర్‌లో భారత సంతతి మహిళపై దాడి

ABN , First Publish Date - 2021-05-11T13:19:00+05:30 IST

మార్నింగ్‌ వాక్‌లో మాస్కు ధరించలేదని 55 ఏళ్ల భారత సంతతి మహిళపై సింగపూర్‌లో ఓ వ్యక్తి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతోపాటు పిడిగుద్దులు కురిపించాడు.

సింగపూర్‌లో భారత సంతతి మహిళపై దాడి

సింగపూర్‌: మార్నింగ్‌ వాక్‌లో మాస్కు ధరించలేదని 55 ఏళ్ల భారత సంతతి మహిళపై సింగపూర్‌లో ఓ వ్యక్తి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతోపాటు పిడిగుద్దులు కురిపించాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దారుణాన్ని ‘చానల్‌ న్యూస్‌ ఏసియా’ సోమవారం వెలుగులోకి తెచ్చింది. ప్రైవేటు ట్యూటర్‌గా పనిచేస్తున్న హిందోచ నీతా విష్ణుభాయి.. చో చూ కాంగ్‌ డ్రైవ్‌ ప్రాంతంలో బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తుండగా ఓ వ్యక్తి ఆమె వద్దకొచ్చి మాస్కును గడ్డంపై నుంచి మూతి మీదకు జరపాలని సూచించాడు. తాను బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తున్నానని ఆమె చెప్పినా, వినిపించుకోకుం డా జాతి వివక్ష వ్యాఖ్యలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఛాతీపై పిడిగుద్దు లు కురిపించాడు. ఆమె వెనక్కి కూలబడి, రక్తం కారుతూ, వణుకుతుండటంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.


Updated Date - 2021-05-11T13:19:00+05:30 IST