సినిమా చూసి వస్తుండగా కత్తి మహేష్‌ కారుపై దాడి

ABN , First Publish Date - 2020-02-14T22:55:40+05:30 IST

సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ కారుపై ముగ్గురు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దాడి చేశారు...

సినిమా చూసి వస్తుండగా కత్తి మహేష్‌ కారుపై దాడి

హైదరాబాద్‌: సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ కారుపై ముగ్గురు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో సినిమా చూసి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కత్తి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైఫాబాద్‌ పోలీసులు దాడి చేసిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.


కాగా.. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము ఈ దాడికి పాల్పడినట్లు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే నగరంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-02-14T22:55:40+05:30 IST