చంద్రబాబు ఇంటిపై దాడి దుర్మార్గం

ABN , First Publish Date - 2021-09-19T05:20:23+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి అన్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడి దుర్మార్గం
ఓర్వకల్లులో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

  1. వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి
  2.  టీడీపీ నాయకుల డిమాండ్‌


ఓర్వకల్లు, సెప్టెంబరు 18: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే రాక్షస పాలన నడుస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, గోపాల్‌ రెడ్డి, అబ్దుల్లా, నాగరాజు, అన్వర్‌బాషా పాల్గొన్నారు.


‘ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం’


నంద్యాల: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు విమర్శించారు. శనివారం నంద్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాములు మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై దాడిచేసి, హత్యాయత్నం చేసేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌, అతని అనుచరులపై కేసునమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రోజుకో ఘటనతో రావణ కాష్టంలా రగిలిపోతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెత్తపై పన్ను వేసే వారిని చెత్త పాలకుడని కాకుండా ఇంకేమనాలని, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దాంట్లో తప్పేమిటని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని, చెప్పుతో కొట్టాలని ఇలా ఎన్నో బహిరంగ సభల్లో జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వంలా వ్యవహరించి ఉంటే జగన్‌ పాదయాత్ర చేసేవాడా అని ప్రశ్నించారు. 


నంద్యాల టౌన్‌: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారాచంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేయడం అమానుషమని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ నాయకుడి ఇంటిపైనే దాడి చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని అన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడిచేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌, అతని అనుచరులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 


ఆళ్లగడ్డ్డ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేయడం అమానుషమని, దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమే్‌ష, అతడి అనుచరులపై  చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు రాముయాదవ్‌, బాచ్చాపురం శేఖరరెడ్డి, మాజీ జడ్పీటీసీ చాంద్‌బాషా డిమాండ్‌ చేశారు.  ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి అఖిలప్రియ స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుపైనే దాడికి పాల్పడితే సామాన్య టీడీపీ కార్యకర్తలు, ప్రజల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. టీడీపీ నాయకులు మర్రిపల్లె పాపిరెడ్డి, జిలాన్‌ పాల్గొన్నారు.


చాగలమర్రి: మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేయడం అమానుషమని టీడీపీ మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా అన్నారు. శనివారం చాగలమర్రి టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఇలాగే వ్యవహరించి ఉంటే ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్‌ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి కుట్రపన్నిన ఎమ్మెల్యే జోగి రమే్‌షపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కొలిమి ఉసేన్‌వలి, సల్లా నాగరాజు, టైలర్‌ అమీర్‌, భాస్కర్‌రెడ్డి, బషీర్‌, సుబ్బారావు, జోసఫ్‌, నాగూర్‌వలి, అజిమ్‌, ఇర్షాద్‌, ఉసేన్‌బాషా, కొండయ్య, గఫార్‌ తదితరులు పాల్గొన్నారు.


శిరివెళ్ల: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌,  అతడి అనుచరులు దాడికి పాల్పడడం అమానుషమని టీడీపీ శిరివెళ్ల మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శిరివెళ్లలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చంద్రబాబుపై దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడిని నిలువరించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ శ్రేణులపైనే లాఠీచార్జి చేయడం హేయనీయమన్నారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మురళి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, నాయకులు పీపీ లింగమయ్య, కొండబోయిన బాలచంద్రుడు, తిరుమల రవి, ఇస్మాయిల్‌, సుభహాన్‌, లింగమ య్య, రాచర్ల రమేష్‌, కరీం, వలి, సుబ్బారెడ్డి, కుమార్‌, బాలజోజి పాల్గొన్నారు. 




Updated Date - 2021-09-19T05:20:23+05:30 IST