బీజేపీ కార్యకర్తపై దాడి : ఇరువర్గాలపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-08-13T04:25:06+05:30 IST

రేచిని గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకుడు తాళ్లపల్లి భాస్కర్‌గౌడ్‌పై జరిగిన దాడి సంఘటనలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సమ్మయ్య తెలిపారు. గురువారం రేచిని వెళ్తుండగా తాండూర్‌కు చెందిన వెంకటస్వామితో పాటు మరికొందరు దాడికి పాల్పడ్డారని, సెల్‌ఫోన్‌ లాక్కున్నారని భాస్క ర్‌గౌడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వంపై సోషల్‌ మీడి యాలో పోస్టులు పెడుతున్నందుకే తనపై దాడి జరిగిందని పేర్కొన్నారు.

బీజేపీ కార్యకర్తపై దాడి : ఇరువర్గాలపై కేసు నమోదు
గాయపడిన బీజేపీ తాండూర్‌ మండల కార్యదర్శి బాస్కర్‌గౌడ్‌ను పరామర్శిస్తున్న జిల్లా అద్యక్షుడు రఘునాథ్‌

తాండూర్‌, ఆగస్టు 12 : రేచిని గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకుడు తాళ్లపల్లి భాస్కర్‌గౌడ్‌పై జరిగిన దాడి సంఘటనలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సమ్మయ్య తెలిపారు.  గురువారం రేచిని వెళ్తుండగా  తాండూర్‌కు చెందిన వెంకటస్వామితో పాటు మరికొందరు దాడికి పాల్పడ్డారని, సెల్‌ఫోన్‌ లాక్కున్నారని భాస్క ర్‌గౌడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వంపై సోషల్‌ మీడి యాలో పోస్టులు పెడుతున్నందుకే తనపై దాడి జరిగిందని పేర్కొన్నారు. అంతకు ముందు రోజు భాస్కర్‌గౌడ్‌కు వచ్చిన బెదిరింపు ఫోన్‌ కాల్‌ రికార్డు కూడా సోషల్‌ మీడియాలో రెండు రోజులుగా చక్కర్లు కొడుతుంది. రవికుమార్‌ అనే వ్యక్తి భాస్కర్‌ గౌడ్‌పై ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొ న్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

దాడులకు పాల్పడడం దుర్మార్గం  

ఏసీసీ: అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే దాడులకు పాల్పడడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు.  మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న తాండూర్‌ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి భాస్కర్‌గౌడ్‌ను శుక్రవారం రఘునాథ్‌ పరామర్శించారు.  నియోజకవర్గ అభివృద్ధి గురించి సోషల్‌ మీడియాలో ప్రశ్నించినందుకు దాడులకు పాల్పడడం సిగ్గుమాలిన చర్య అన్నారు.  అనంతరం డీసీపీ కార్యాలయంలో దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు  తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీ బొమ్మెన హరీష్‌,  నాయకులు ఆనంద్‌కృష్ణ, జైన్‌, రమేష్‌, సంతోష్‌, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-13T04:25:06+05:30 IST