తొండవాడలో గ్రామ వలంటీర్‌పై దాడి

ABN , First Publish Date - 2020-08-10T11:22:33+05:30 IST

చంద్రగిరి మండలంలోని తొండవాడలో గ్రామ వలంటీర్‌ భానుప్రియపై దాడి జరిగింది.

తొండవాడలో గ్రామ వలంటీర్‌పై దాడి

నలుగురిపై కేసు నమోదు


చంద్రగిరి, ఆగస్టు 9: చంద్రగిరి మండలంలోని తొండవాడలో గ్రామ వలంటీర్‌ భానుప్రియపై దాడి జరిగింది. ఉపాధి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సెలవుపై వెళ్లడంతో వలంటీర్‌ శనివారం రాత్రి ఉపాధి కూలీలకు సంబంధించిన మస్టర్‌లో సంతకాలు తీసుకోవడానికి వెళ్లారు. గ్రామానికి చెందిన గంగాధర్‌, సునీత, బిందు, జయంతిలు ఇతరుల జాబ్‌ కార్డుతో పనులు చేశారు. దాంతో వలంటీర్‌ వారివద్ద సంతకాలు తీసుకోలేదు. ఈ విషయమై వలంటీర్‌తో ఘర్షణకు దిగి.. ఆమె తలపై రాయితో దాడిచేశారు. గాయపడ్డ వలంటీర్‌ను గ్రామస్తులు చికిత్స నిమిత్తం చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. ఆదివారం నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-08-10T11:22:33+05:30 IST