బూర్గుపల్లిలో బెల్టుషాపుపై దాడి

ABN , First Publish Date - 2021-08-03T04:49:54+05:30 IST

మండలంలోని బూర్గుపల్లిలో బెల్టుషాపుపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడి చేసి రూ. లక్షకు పైగా విలువైన మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు

బూర్గుపల్లిలో బెల్టుషాపుపై దాడి
దాడిచేసి పట్టుకున్న మద్యాన్నిచూపుతున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

రూ. లక్షకు పైగా విలువైన మద్యం, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం 

హవేళీఘణపూర్‌, ఆగస్టు 2:  మండలంలోని బూర్గుపల్లిలో బెల్టుషాపుపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడి చేసి రూ. లక్షకు పైగా విలువైన మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బూర్గుపలిలోని ఇలితెం రాములుకు చెందిన కిరాణాషాపులో తనిఖీలు నిర్వహించి రూ. 1,24,150 విలువ చేసే మద్యం బాటిళ్లతో పాటు రూ. 6,295 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని సంబంధిత పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించి విచారణ జరుపుతున్నట్లు వివరించారు. తనిఖీలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సీఐ మురళీకుమార్‌, ఎస్‌ఐ గోప్యానాయక్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-08-03T04:49:54+05:30 IST