ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

ABN , First Publish Date - 2021-10-24T05:35:38+05:30 IST

ఎర్రచందనం రక్షణకోసం అడవిలోకి వెళ్లిన ప్రొటెక్షన వాచర్లపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేయడంతో కొందరు గాయపడ్డ ఘటన శనివారం సిద్దవటం మండలంలో జరిగింది. అటవీ అఽధికారుల సమాచారం మేరకు..

ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది

ప్రొటెక్షన వాచర్లకు గాయాలు

సిద్దవటం, అక్టోబరు 23: ఎర్రచందనం రక్షణకోసం అడవిలోకి వెళ్లిన ప్రొటెక్షన వాచర్లపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేయడంతో కొందరు గాయపడ్డ ఘటన శనివారం సిద్దవటం మండలంలో జరిగింది. అటవీ అఽధికారుల సమాచారం మేరకు.. శుక్రవారం సిద్దవటం మండలం కొండూరు సెక్షన, రెడ్డిపల్లె దారిలో నుంచి అడవిలోకి ఎర్రచందనం స్మగ్లర్లు వెళ్లారని సమాచారం అందింది. వీరిని పట్టుకునేందుకు 15 మంది ప్రొటెక్షన వాచర్లను వెంటతీసుకుని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ప్రసాద్‌ ఆధ్వర్యంలో సెక్షన ఆఫీసర్‌ షకీల్‌ అహమ్మద్‌, బీట్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌రెడ్డి కూంబింగ్‌ చేపట్టారు. వీరికి శనివారం  అడవిలో కుక్కలగుంట వద్ద దాదాపు 30మంది తమిళ కూలీలు ఎర్రచందనం చెట్లను నరుకుతూ కనిపించారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన ప్రొటెక్షన వాచర్లపై స్మగ్లర్లు దాడికి దిగారు. ఈ దాడిలో ప్రొటెక్షన వాచర్లు కొందరికి స్వల్ప గాయాలు కాగా శ్రీకాంత తలకు, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం బద్వేలు ఆసుపత్రికి తరలించారు. ఈ కూంబింగ్‌లో ఒక తమిళ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన వారందరినీ పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తెలిపారు.

Updated Date - 2021-10-24T05:35:38+05:30 IST