జగన్‌పై మూకుమ్మడి దాడి

ABN , First Publish Date - 2020-04-10T20:44:00+05:30 IST

సీఎం జగన్‌పై ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడికి దిగాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను టీడీపీ, సీపీఐ, జనసేన పార్టీలు తప్పుబడుతున్నాయి. రోమ్‌ చక్రవర్తిలా

జగన్‌పై మూకుమ్మడి దాడి

అమరావతి: సీఎం జగన్‌పై ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడికి దిగాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను టీడీపీ, సీపీఐ, జనసేన పార్టీలు తప్పుబడుతున్నాయి. సీఎం జగన్‌ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని సీపీఐ నేత రామకృష్ణ జోస్యం చెప్పారు. ‘‘మాస్క్‌లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నారు. కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేష్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. తన మాట విననందుకు రమేష్‌కుమార్‌పై జగన్‌ కక్షగట్టారు. చెప్పినట్టు వింటే రమేష్ కులం కూడా జగన్‌కు కనిపించేది కాదు. రమేష్‌కుమార్‌ను తొలగించే అధికారం జగన్‌ ప్రభుత్వానికి లేదు. ఎస్‌ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. ప్రపంచమంతా కరోనా ఉంటే.. జగన్‌ కొత్త వైరస్‌ కనిపెడుతున్నారు’’ అని రామకృష్ణ ధ్వజమెత్తారు.


రోమ్‌ చక్రవర్తిలా సీఎం జగన్‌ తీరు ఉందని జనసేన లీగల్‌ సెల్‌ నేత గాదె వెంకటేశ్వర్లు ఆక్షేపించారు. ప్రపంచమంతా కరోనా విజృంభిస్తుంటే ఏమీ పట్టించుకోకుండా.. జగన్‌ కక్షపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలన్నీ చట్ట విరుద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్‌లో 13 జిల్లాలను కూడా వాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.


Updated Date - 2020-04-10T20:44:00+05:30 IST